హిందూవులకు కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది…నిత్యం దైవపూజలు చేయనివారు కూడా కార్తీకమాసంలో మాత్రం తెల్లవారుజామునే లేచి..కార్తీకస్నానం ఆచరించి..దీపం వెలిగించి పరమశివుడిని పూజిస్తారు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో నిష్టతో నోములు కూడా ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రతి రోజు పర్వదినమే. కాబట్టి ఉపవాసాలు ఉంటారు. భగవంతుడిపై మనసు లగ్నం చేయాలంటే..ఉపవాసం ఉండాలని అంటారు. అయితే కొందరు …
Read More »రేపు ఒక్కరోజు ఈశ్వరుడికి ఇలా పూజ చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలం…!
రేపు నవంబర్ 4 సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కార్తీకమాసంలో శ్రవణం రోజున కోటి సోమవారం పండుగ రావడం మిక్కిలి విశేషం. రేపు సోమవారం ఉదయం దగ్గరల్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, ఉపవాసం ఉండాలి. మళ్లీ సాయంత్రం ప్రదోష కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని, మళ్లీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని దీపారాధన చేయాలి. తదనంతరం రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు …
Read More »అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు…శ్రీ స్వాత్మానందేంద్ర..!
అక్టోబర్ 31న నాగులచవితి, గురువారం నాడు భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలే ఊపిరిగా..స్వధర్మ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న..విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు, గురువర్యులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం సిద్ధమవుతోంది. ఈ రోజు చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తమ గురువర్యులు, పీఠాధిపతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకల …
Read More »దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?
దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ …
Read More »తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం…!
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, …
Read More »