అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అసలు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వటాన్ని ఆ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈక్రమంలో మహిళలకు వచ్చే రుతుక్రమాన్ని ‘డర్టీ థింగ్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు కల్పించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై రాష్ట్రంలోని మహిళాసంఘాలు మండిపడుతున్నాయి.
Read More »మంత్రి కుమారుడికి జీవిత ఖైదు
అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని …
Read More »ఆ ముక్క కోసం…88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన టీచర్..
క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఇదే తరహలో ఓ స్కూల్‌లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్‌లో క్లాస్ టీచర్‌పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. …
Read More »