సీనియర్‌హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
Read More »