ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …
Read More »కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కారు ఉద్యోగులకు బంపర్ ఆఫర్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ తొలి దశలో టూ వీలర్ వాహనాలను అందించనుంది. తొలుత ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసిన పదివేల మంది ఉద్యోగులకు రూ.5 వేల చొప్పున ఇన్సెంటివ్ అందిస్తామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. దీంతోపాటు మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ …
Read More »ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యొక్క అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »రాజ్యసభకు హర్భజన్ సింగ్
అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
Read More »పంజాబ్‌లో దుమ్ములేపిన ఆప్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవే..
దిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. యూపీ, పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎగ్జిట్‌పోల్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వచ్చాయి. యూపీలో తొలి నుంచే అధికార బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్‌లోనూ కాషాయ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. …
Read More »దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తొలిసారిగా యూపీలో కాంగ్రెస్ ..?
యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.
Read More »పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను
త్వరలో దేశంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించే అవకాశముంది. పంజాబ్ సీఎంగా భగవంతు చేయాలని తాను భావిస్తున్నట్లు ఆప్ అధినేత కేజీవాల్ తెలిపారు. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థిని వారం రోజుల్లో ప్రకటిస్తానని ఇటీవల ప్రకటించారు కేజీవాల్. ఈక్రమంలో సీఎం అభ్యర్థిపై సూచన ప్రాయంగా ఒక ప్రకటన చేశారు.
Read More »ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వరాల జల్లు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.
Read More »సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం
గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.
Read More »హ్యాపీ బర్త్‌డే.. మోదీ జీ- ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే, మోదీజీ అంటూ రాహుల్ తన ట్విట్టర్‌లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
Read More »