ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »ప్రయాణికులకు APSRTC శుభవార్త
క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …
Read More »ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొత్త ఏడాది కానుక అందించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉద్యోగులకు శుక్రవారం ఉచిత బస్ పాస్టు అందించారు. ఈ ఉచిత బస్ పాస్లు వారి నివాస స్థలం నుంచి 25 కిలో మీటర్లలోపు ప్రయాణానికి వర్తిస్తాయి. ఈ పాస్ల వల్ల 5 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
Read More »ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం
ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.
Read More »జనతా కర్ఫ్యూ… ఏపీలో ఆర్టీసీ బంద్..!
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 22న) మొత్తం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. అన్ని పట్టణాల్లో లోక్‌ల్ సర్వీసులను ఆదివారం ఉదయం నుంచి నిలిపివేయనున్నామని, దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను …
Read More »ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్పు.. ఇకపై పీటీడీ !
“ఏపీ ప్రజా రవాణా శాఖగా” ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్చుకుంది.. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఈ పేరు మారింది. ఇప్పటివరకు ఆర్టీసీ ప్రత్యేక అధికారాలు గల సంస్థగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం లో విలీనం కావటంతో ప్రభుత్వం పేరు మార్చింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్టీసీని విలీనం చేస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు లోబడి గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఆర్టీసీ …
Read More »వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ‍్య మాత్రం ఆ పదవిని వదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా వల్ల పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవినుంచి వైదొలగడానికి రాష్ట్రప్రభుత్వం వర్ల రామయ్యకు నెలరోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీకాలం కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది. …
Read More »ఆర్కే రోజాకు జగన్ “అదిరిపోయే” గిఫ్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు. హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక …
Read More »ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఫిబ్రవరి 6 నుంచి బస్సులు బంద్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈరోజు విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస.. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. బంద్ లో భాగంగా 52,000 మంది ఆర్టీసి సిబ్బంది విధులకు హాజరుకాబోరని ఐకాస స్పష్టం చేసింది. ఆర్టీసీలో …
Read More »