ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Read More »చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి వ్యాఖ్యలపై YSRCP MLA క్లారిటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Read More »మూడు రాజధానులపై AP సర్కారు సంచలన నిర్ణయం
ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
Read More »మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …
Read More »తనపై వస్తోన్న వార్తలపై మంత్రి అవంతి శ్రీనివాస్ క్లారిటీ
ఏపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు. …
Read More »ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక మహిళా పోలీసు..
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా సెలవులు ఉండవని పేర్కొంది. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 18 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి..
Read More »ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొత్త ఏడాది కానుక అందించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉద్యోగులకు శుక్రవారం ఉచిత బస్ పాస్టు అందించారు. ఈ ఉచిత బస్ పాస్లు వారి నివాస స్థలం నుంచి 25 కిలో మీటర్లలోపు ప్రయాణానికి వర్తిస్తాయి. ఈ పాస్ల వల్ల 5 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
Read More »చిల్డ్రన్స్ డే సాక్షిగా పప్పులో కాలేసిన లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా మళ్లీ పప్పులో కాలేశాడు. ఈ రోజు బాలల దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఏపీలోని బాలలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా విషెస్ చెప్పాలని నారా లోకేష్ నాయుడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కంకణం కట్టుకున్న నారా లోకేష్ …
Read More »సీఎం జగన్ కు అందరూ ఫిదా
ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు. ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం …
Read More »