ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలను మంత్రి బోత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అర్హులైన వారి జాబితాను ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరేండ్ల పాటు ట్రిపుల్ ఐటీ కి నాలుగు వేల నాలుగోందల సీట్లు ఉన్నాయి అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు …
Read More »ఏపీ సీఐడీ అధిపతిగా ఆంజనేయులు
ఏపీ సీఐడీ విభాగ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఆంజనేయులకు అప్పజెప్పింది. అయితే ప్రస్తుత సీఐడీ విభాగ అధిపతి అయిన సంజయ్ ఐపీఎస్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటతో ఆయన కొన్ని రోజులుగా మెడికల్ లీవ్స్ లో ఉన్నారు. దీంతో సంజయ్ స్థానంలో ముందు సీఐడీ ఐజీ …
Read More »లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా
ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Read More »టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ …
Read More »టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …
Read More »లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. …
Read More »చంద్రబాబు ,లోకేష్ లకు ప్రాణహాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా రాక్షస పాలన సాగుతుందని ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ అధినేత.. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఆయన తనయుడు నారా లోకేష్‌కి ప్రాణ హాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై …
Read More »కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు
ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …
Read More »తిరుమలలో సీఎం జగన్
ఏపీ సీఎం… వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి …
Read More »