ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »ఏకైక ఎమ్మెల్సీ వైసీపీ వశం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read More »ఏపీలో కరోనా తగ్గుముఖం
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …
Read More »ఉద్దానం గోసకు చెక్.. జగన్ శాశ్వత పరిష్కారం
ఉద్దానం.. గడిచిన కొన్ని దశాబ్ధాలకు పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య. ఏపీలోని రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మారినా దశమారని ఉద్దానం దీనగాథను ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉద్దానంతో రాజకీయం చేసి ఓట్లు సంపాదించుకొని కొందరు ట్విట్టర్ లో హల్ చల్ చేసి వదిలేసిన వారే కానీ ఎవరూ చిత్తశుద్ధితో దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఈ …
Read More »ఏపీలో కరోనా డేంజర్ బెల్స్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,012 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇందులో 85,945 కేసులు యాక్టివ్ గా ఉంటె, 2,01,234 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 88 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2650 …
Read More »మంత్రి బొత్స ఇంట విషాదం
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది.మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మరణించారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Read More »వైసీపీ గూటికి టీడీపీ నేత
టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. అంతకుముందు 2009లో ప్రజారాజ్యంపార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. తాజాగా గతేడాది 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీకి రాజీనామా …
Read More »ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఈ నెల 15న సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలు కేబినెట్లో …
Read More »