వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »హద్దులు దాటిన పవన్ ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం …
Read More »టీడీపీకి మరో నేత గుడ్ బై
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కాషాయ కండువా కప్పేసుకున్నారు. అంతేకాదు సిట్టింగ్‌లు కూడా కమలం గూటికి చేరిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. టీడీపీకి చెందిన ముఖ్యనేత, సివిల్ సప్లై కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం బీజేపీ జాతీయ …
Read More »నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …
Read More »బాబు & లోకేశం నయా డ్రామాలు..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఓడిపోయినప్పట్నుంచి మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోయిన ప్రజామద్దతును కూడగట్టుకునేందుకు, జనాల నోళ్లలో నానేందుకు వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు ఒకటి రెండు అని చెప్పలేం. ఫలితాలు వచ్చిన వెంటనే ఓదార్పు డ్రామాలు ప్రారంభించారు. అవి బెడిసికొట్టిన వెంటనే ఇంకోటి.. ఆ వెంటనే …
Read More »సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా …
Read More »నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం..!
నవ్యాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్ అవుట్ రీచ్’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన …
Read More »50రోజుల జగన్ పాలనపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే…!
ఇటీవల నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని.. వైసీపీ సర్కారు ఏర్పడి యాబై రోజులవుతున్న సందర్భంలో ఒక ప్రముఖ ఏజెన్సీతో కల్సి ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ …
Read More »గడికోట శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్ ర్యాంక్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన ..శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన …
Read More »టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఔట్..!
నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నదీజలాల పంపకంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో గోదావరి జలాల మల్లింపుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూభాగంపై నుంచి కాకుండా ఏపీ మీదుగా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబట్టారు. అయితే కేవలం పన్నెండు శాతం మాత్రమే గోదావరి నీళ్ళు …
Read More »