ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »ఏపీలో మరో ఓటుకు నోటు తరహా-నామినేషన్ వేస్తే 2లక్షలు ఆఫర్..?
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …
Read More »షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »ఏకైక ఎమ్మెల్సీ వైసీపీ వశం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read More »బాబు అన్నంత పని చేసేశాడు
కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు
Read More »ఏపీలో కరోనా తగ్గుముఖం
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …
Read More »తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి
ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. …
Read More »ఏపీ మంత్రికి లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …
Read More »ఉద్దానం గోసకు చెక్.. జగన్ శాశ్వత పరిష్కారం
ఉద్దానం.. గడిచిన కొన్ని దశాబ్ధాలకు పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య. ఏపీలోని రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మారినా దశమారని ఉద్దానం దీనగాథను ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉద్దానంతో రాజకీయం చేసి ఓట్లు సంపాదించుకొని కొందరు ట్విట్టర్ లో హల్ చల్ చేసి వదిలేసిన వారే కానీ ఎవరూ చిత్తశుద్ధితో దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఈ …
Read More »