తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. …
Read More »తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో …
Read More »జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు పొగిడారుజ వీరిద్దరూ పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తంచేశారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ . త్వరలో కొత్త …
Read More »టీడీపీ తుడిచిపెట్టుకుపోయే కామెంట్స్ చేసిన మంత్రి అవంతి.. త్వరలో ఉప ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీ చాలా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది. ఈక్రమంలో పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని నిర్మాణం, వరదల పరిస్థితులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం పెరిగింది. ఇదంతా సీఎం జగన్ విదీశీ పర్యటనలో ఉన్నపుడు జరిగింది. టీడీపీ నేతలు వరుస విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొడుతోంది. అయితే తాజాగా మంత్రి …
Read More »జగన్ హిందువు కాదు.. దైవభక్తి లేదని వాదించే వారంతా కచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్
రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుదిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలి దశలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించింది. దీనికోసం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులను ఆదేశించింది. జిల్లాలవారీగా ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలుచేసే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే …
Read More »జగన్ అభీష్టం ఉన్నంతవరకూ క్యాబినేట్ హోదాతో అమర్ ఈ పదవిలో కొనసాగుతారు
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ జాతీయ మీడియా – అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఈమేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం అమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభీష్టం ఉన్నంతవరకూ అమర్ ఈపదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని విధివిధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు సదరు జీవోలో పేర్కొన్నారు. …
Read More »మీ ఏడుపులు దేనికో అందరికి తెలుసు బాబూ..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు మరియు పచ్చ దొంగలపై ధ్వజమెత్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో గాని చివరికి ఎవరు చేసిన పాపం వారిని వదలదని, దీనికి ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి చిదంబరమే అన్నారు. 20 సార్లు ముందస్తు బెయిలుతో తప్పించుకున్న చివరకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఇక ఎన్నో అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతేనని …
Read More »సీఎం జగన్, మంత్రి అనిల్ ను దుర్భాషలాడడంతో సీరియస్ గా తీసుకుని పెద్దఎత్తున ఫిర్యాదులు చేసిన వైసీపీ
తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుస తప్పుడు కథనాలు, సన్నివేశాలతో, తప్పుడు వీడియోలతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెయిడ్ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కోరారు. టీడీపీకి చెందిన జూనియర్ పెయిడ్ ఆర్టిస్ట్ ల విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. అలాగే …
Read More »అందరినీ ఆశ్చర్య పరుస్తున్న కోడెల కక్కుర్తి చేష్టలు.. ఫర్నీచర్ దొబ్బేయడం ఏంటయ్యా.?
తాజాగా ఏపీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగిందట.. ఈ ఘటనలో దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. అయితే కరెంటు పనిచేయాలని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని వాచ్ మెన్ చెప్పారు. …
Read More »చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తే శ్రీకృష్ణ జన్మాష్టమి.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని సీఎం జగన్ అన్నారు. ఆ విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
Read More »