చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …
Read More »డౌట్ లేదు.. అది కూడా చంద్రబాబే కనిపెట్టి ఉంటాడు: వల్లభనేని వంశీ
టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More »బాలకృష్ణకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్!
తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో …
Read More »ఆత్మకూరు పోరు.. విక్రమ్‌రెడ్డికి బీఫారం అందించిన జగన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ తరఫున బీఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »పవనే తమ వెంట పడుతున్నాడని అమిత్‌షా చెప్పారు: కేఏ పాల్
వచ్చే ఎన్నికల్లో 175 లోక్‌సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాతో చర్చించినట్లు పాల్ తెలిపారు. …
Read More »వాళ్లే టెన్త్ పేపర్లు లీక్ చేశారు: సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే టెన్త్ పరీక్షల పేపర్లను లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీకి మాజీ మంత్రి నారాయణకు చెందిన శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని …
Read More »ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సర్వే చేయించారు: కొడాలి నాని
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …
Read More »అప్పుడెందుకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు?: సామినేని ఉదయభాను
టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …
Read More »ఏపీ కేబినెట్ రీషఫిల్.. జగన్ నిర్ణయం అదే!
ఏపీ కేబినెట్ రీషఫిల్ ఎప్పుడనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎల్పీ మీటింగ్‌లో కేబినెట్ రీషఫిల్ త్వరలోనే ఉంటుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ అవుతోంది. ఈనెల 30న కేబినెట్ రీషఫిల్ చేయాలని తొలుత సీఎం జగన్ భావించారు. అయితే ఉగాదికి ముందు అమావాస్య ఉండటంతో …
Read More »పవన్.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్ పాలిటిక్స్?
‘దరువు.కామ్’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్ కట్ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …
Read More »