ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Read More »మూడు రాజధానులపై AP సర్కారు సంచలన నిర్ణయం
ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
Read More »