విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. …
Read More »మార్చి 28నుండి ఏపీ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మొదలు కానున్నాయి.దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ మొట్టమొదటిసారిగా ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాని(2020-21)కి సంబంధించిన బడ్జెట్ ను ఈ నెల ముప్పై తారీఖున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ ప్రవేశ …
Read More »సంచలనం..ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్..!
నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్వయంగా సీఎం జగన్ ప్రవేశపెట్టారు. తొలుత కేబినెట్‌లో సమావేశంలో శాసనమండలి రద్దు నిర్ణయంపై ఆమోద ముద్ర వేసిన అనంతరం…స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ కమిటీని సమావేశపరిచారు. అయితే ఈ బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరు కాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశం కాగానే సీఎం జగన్ శాసనమండలి రద్దు …
Read More »ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం …
Read More »పురాణేతిహాసాలను జోడిస్తూ వైసీపీ ఎమ్మెల్యే శాసనసభలో ప్రసంగం
‘మందర మాటలు విని శ్రీరాముడిని కైక అడువులకు పంపినట్టే.. చంద్రబాబు మాటలు విని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోనియాగాంధీ కష్టాలపాలు చేశారు. అరణ్యవాసం చేసిన శ్రీరాముడికి ప్రజలు పట్టాభిషేకం చేసిన విధంగానే వైఎస్ జగన్‌ను కూడా రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు’ అంటూ పురాణేతిహాసాలను జోడిస్తూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి చేసిన ప్రసంగం గురువారం శాసనసభలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై జరిగిన చర్చలో ఆమె అనేక …
Read More »టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నతీరు చూస్తే గుండె రగిలి పోతోందంట
టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నతీరు చూస్తే గుండె రగిలి పోతోందని,అసెంబ్లీ కాకపోతే తడాకా చూపించేవాళ్లమని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కరణం ధర్మశ్రీ, జక్కంపూడి రాజా తదితరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే రక్తం ఉడికిపోతోందని జక్కంపూడి రాజా అన్నారు. ఇది అసెంబ్లీ అని ఓపిక పట్టామని, లేకుంటే తాము ఏమిటో చూపించేవారమని అన్నారు. టీడీపీ వారు గత ఐదేళ్లు దున్నపోతుల్లా దోచుకుతిన్నారని …
Read More »మూడు రాజధానులపై జగన్ సర్కార్ సంచలన ప్రకటన.. అమరావతి రైతులకు చెప్పింది ఇదే..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …
Read More »చంద్రబాబు గుట్టును రట్టు చేసిన బుగ్గన.. మొత్తం స్కామ్ ను బయటపెట్టడంతో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజదాని అమరావతిలో ఒక సామాజికవర్గం వారు మాత్రమే లేరని,అన్ని వర్గాల వారు ఉన్నారని, బలహీనవర్గాల వారు అదికంగా ఉన్నారని వాదించారు. కాని ఒక సామాజికవర్గం కోసం రాజధాని అని ప్రచారం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సంచలన రీతిలో సమాధానం ఇచ్చారు.రాజదానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కాని, అస్సైన్డ్ భూములు కాని ఎవరెవరు కొనుగోలు …
Read More »చంద్రబాబు తప్ప మిగిలిన తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, రామకృష్ణ బాబు, అశోక్ ,రామ్మోహన్ , సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, సత్య ప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ రాజదానికి …
Read More »అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయింపు
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఆర్అండ్‌బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం ఈ అంశంపై శాసన మండలిలో మాట్లాడారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు అవసరమైన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్థంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోందని కృష్ణదాస్ వెల్లడించారు. ఈ హైవే కోసం భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని నిర్మాణం కోసం …
Read More »