సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సిఎం మద్యాహ్న భోజనం చేశారు. యువకులకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని సిఎం అన్నారు.
Read More »సివిల్స్ టాపర్ ను అభినందించిన ఎంపీ కవిత
సివిల్స్-2017 టాపర్ దురిశెట్టి అనుదీప్ తన తల్లిదండ్రులతో పాటు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిశారు. అనుదీప్ ను ఆమె అభినందించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి తెలంగాణ పేరు ప్రఖ్యాతులను మరింత పెంచారని ప్రశంసించారు. సివిల్స్ టాపర్ అనుదీప్, బాక్సర్లు అసాముద్దీన్, నిఖత్ జరీన్ లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. వారి …
Read More »