రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో పని చేస్తున్న పెండ్యాల శ్రీనివాస్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అధికారంలో ఉన్నప్పుడూ రెండు దశాబ్దాలపాటు చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా వ్యవహరించారు. చంద్రబాబుకు సంబంధించిన లావాదేవీలన్నీ శ్రీనివాసే నిర్వహించే వారని టీడీపీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. శ్రీనివాస్ నివాసాల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుంది. చంద్రబాబుకు ఏయే …
Read More »ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ
ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళుతున్న హెచ్ పి గ్యాస్ ట్యాంకర్ నుండి గ్యాస్ లీకవుతున్న సంఘటనతో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పూర్తి స్థాయిలో రాకపోకలు స్థంభించాయి. స్థానిక ప్రజలు …
Read More »జేసీ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో.. అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా..?
అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఏంపీ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీల్లో కీలక నేతగా మెలిగిన దివాకర్ రెడ్డి అప్పట్లో తన బస్సులను ఇష్టారీతిన నడిపించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు దివాకర్ రెడ్డి ఉన్న పార్టీ ప్రతిపక్షంలో …
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!
ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో …
Read More »పవన్ కల్యాణ్ గడ్డాలు తీసేసి సినిమాలకు ఎందుకు సిద్ధమయ్యాడో తెలుసా..
జనసేన గ్లాస్ పగిలిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని ఆయన అన్నారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌కు లేవన్నారు. ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పరిపాలన బాగుంటే సినిమాలు తీసుకుంటానని ఓ బహిరంగ సభలో చెప్పిన మాటను నిజం చేస్తున్నాడని …
Read More »ఏబీవీ సస్పెషన్…చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిన కేశినేని నాని..!
భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్‌ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. …
Read More »టీడీపీ ప్రభుత్వ హయాంలో కిలాడి లేడీ దీప్తి ఏం చేసిందో తెలుసా..!
ఉద్యోగాలిప్పిస్తానంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వసూలు చేసి ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడి లేడీ మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పెదకాకానికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 11 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ అనురాధ చెప్పారు. అప్పట్లో సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపే …
Read More »జగన్ దమ్ముంటే రా..అంటున్న చంద్రబాబు..ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతా అన్నది ఎవరు
జగన్‌కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి.. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు ..మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అయితే, కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుందని కానీ మార్చే హక్కు మాత్రం ఉండదన్నారు. జగన్ మూడు అంటే.. ఇంకొకరు ముప్పై రాజధానులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ ఎక్కడా జరగలేదు.. మూడు రాజధానులు …
Read More »ఇవాళ పలు సంక్షేమ పథకాలపై సీఎం జగన్ రివ్యూ.. బిజీ బిజీగా
రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచించాను కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ సహా విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విద్యతోనే పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దారిద్య్ర నిర్మూలన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఆయన, అలా …
Read More »రైతులు సీఎం మాట వింటారనే భయంతోనే చంద్రబాబు ఉద్యమం
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి ఉద్యమం పేరుతో అభివృద్ధి మొత్తం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటీవల ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జగన్ ను రాజధాని ప్రాంత రైతులు అందరూ కలిసి తమ సమస్యలు విన్నవించారు. వారితో జగన్ మాట్లాడుతూ… ప్రస్తుతం …
Read More »