దివంగత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్సార్‌ని గుర్తు చేసుకున్నారు. ‘పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది’అని పేర్కొన్నారు. …
Read More »రేపు సీఎం జగన్ ఇడుపులపాయకు..!
సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్ ఘాట్ …
Read More »ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని సీఎం వైఎస్ జగన్ పిలుపు
పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా డోకిపర్రు వద్ద మొక్కను నాటి సీఎం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే …
Read More »సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసులను నియమించి అక్రమ మద్యం ,నాటు సారాలను అరికట్టే చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గిందన్నారు. అక్టోబరు నుంచి 20 శాతం మద్యం దుకాణాలు, బార్లను తగ్గించడమే కాకుండా, దశలవారీగా మద్య నిషేధం అమలుకి అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ …
Read More »సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో 5 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో కోర్టు ఆదేశాలతో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం… టీడీపీ నేత, కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దనరాజు ఈనెల 26న తన అనుచరులు అణ్ణామలై, శ్రీనివాసులు, సూర్యప్రకాష్‌రెడ్డి, శ్యామరాజుతో కలసి విహారయాత్రకు తలకోన వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. …
Read More »చంద్రబాబుకు షాక్.. ముగ్గురు టీడీపీ నేతలు సెప్టెంబరు 1న జగన్ సమక్షంలో వైసీపీలోకి
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు భారీగా చేరుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక మాకు రాజకీయ భవిష్యత్ ఉండదని మరో 20 ఏళ్లు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఉండబోతున్నారని తెలుసుకోని వైసీపీలో చేరుతన్నట్లు సమచారం. తాజాగా విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు కొడుకు ఆనంద్ వైసీపీలో చేరుతున్నారని సమచారం. గడిచిన …
Read More »వైఎస్ జగన్ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన మరో వ్యక్తి అరెస్ట్ … నారా లోకేష్ గురించి ఏం చెప్పాడో తెలుసా
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం రైతు వేషంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కులంపేరుతో దూషించిన కేసులో శేఖర్ చౌదరిని.. పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.తాజాగా ముఖ్యమంత్రి గారి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి నవీన్ …
Read More »రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …
Read More »ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసిన సీఎం జగన్
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవటంతో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. “శైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం” అని సీఎం వైఎస్ జగన్ …
Read More »అమెరికాకు వైఎస్ జగన్ ..అపూర్వరీతిలో స్వాగతం..భారీ ఏర్పాట్లు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న జగన్ అక్కడ వారం రోజుల పాటు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లోని కన్వెన్షన్ హాలులో జగన్ అమెరికాలో ఉన్న తెలుగు వారితో సమావేశమవుతారు. ఈ …
Read More »