ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ‘టీచర్లకు 100% వ్యాక్సినేషన్ పూర్తైంది. 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు 90శాతానికి పైగా వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అమెరికాలో లక్షల కేసులు వస్తున్నా విద్యాసంస్థలు మూసివేయలేదు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
Read More »ఏపీలో ప్రముఖులకు కరోనా
ఏపీలో ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ రాగా.. మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు.
Read More »ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »నా హత్యకు కుట్ర జరుగుతుంది..
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …
Read More »పాలిటిక్స్ రీఎంట్రీపై చిరంజీవి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్మోహాన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించారు చిరంజీవి. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు రూమర్స్ మాత్రమే అని.. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావని చిరంజీవి స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. పదవులకు అతీతంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఇక, తాను సీట్ల ఆఫర్లకు ఆశపడేవాడిని కాదని, అలాంటివి కోరుకోవడం లేదని …
Read More »రాజ్యసభ సీటుపై మెగాస్టార్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.మెగాస్టార్ చిరంజీవి ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి మెగాస్టార్ కు రాజ్యసభ సీటు ఖరారైందని వార్తలు చక్కర్లు కొట్టాయి.. దీంతో తనకు రాజ్యసభ సీటు అన్న వార్తలను ఖండించారు మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం.. సీఎం జగన్ ను …
Read More »సీఎం జగన్ కు బాబు వార్నింగ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హత్యకు గురైన టీడీపీకి చెందిన సీనియర్ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకుముందు ఆయన చంద్రయ్య పాడే మోశారు. ‘ఈ హత్యపై సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికే 33మంది …
Read More »బాబుపై ఆర్కే రోజా ఫైర్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై అధికార పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా… ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే …
Read More »థాయ్ లాండ్ కి మాజీ సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలసి థాయ్ లాండ్ విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ నెల 24వ తేదీనే వెళ్లినప్పటికీ పలు కారణాల వల్ల ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »బాబుకు షాక్ -టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.! ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. అయితే తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా …
Read More »