ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 47,803 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 210 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,227 ఉన్నాయి.. ఇప్పటివరకు 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం 7,180 మంది కరోనాతో చనిపోయారు
Read More »కడప స్టీల్ ప్లాంట్ పై మరో ముందడుగు
ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ పై ముందడుగు పడినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం.. 2020 డిసెంబర్ 20న ప్రతిపాదనలు పంపించి, అత్యంత వేగంగా అనుమతులు పొందామంది. కాగా కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది.
Read More »చంద్రగిరిలో చరిత్ర సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఏపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి విధితమే..ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో మెజార్టీ పంచాయతీల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది..ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొత్తం 107గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో 105గ్రామ పంచాయతీల్లో విజయ దుందుభి మ్రోగించింది.. అయితే ప్రధాన ప్రతిపక్ష …
Read More »జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …
Read More »ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ,టెట్ నోటిఫికెషన్స్
ఏపీలో మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వీటి నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై కసరత్తు చేస్తున్నాముని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. అటు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రస్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్ఈ అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ కు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది
Read More »ఢిల్లీకి సీఎం జగన్ .. అందుకేనా..?
ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. విశాఖ స్టీల్ పై ప్రజల్లో ఉన్న మనోభావాలను సీఎం ఇద్దరు నేతలకూ తెలియజేయనున్నారు
Read More »గ్రామవాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గ్రామవాలంటీర్లకు శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామ/వార్డు వాలంటీర్లను సత్కరించనున్నది వైసీపీ ప్రభుత్వం.. ఇందుకోసం వాలంటీర్లను 3 కేటగిరీలు మార్చింది. లెవల్-1 కింద ఏడాది సేవలందించిన వారికి సేవామిత్ర కింద బ్యా డ్లీ, రూ.10వేలు, లెవల్-2 కింద ప్రతి మండలం/పట్టణంలో ఐదుగుర్ని ఎంపిక చేసి వారికి సేవారత్న కింద బ్యా డీ, రూ.20వేలు, లెవల్-3లో ప్రతి నియోజకవర్గంలో …
Read More »ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్
ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.
Read More »ఏపీలో హైవేల కోసం రూ.4,459కోట్లు
ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్‌లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది. కాగా, ఎన్‌హెచ్ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు …
Read More »దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ-ఏపీ
కరోనా లాక్ డౌన్, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 2020 జూన్ నాటికి దేశంలో 55.41% ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లుండగా.. సెప్టెంబర్ కు అది 57.29%గా ఉంది. ఇక వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా చూస్తే మహారాష్ట్ర తొలి స్థానంలో, ఏపీ-తెలంగాణ సర్కిల్ 2వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద మందిలో 67.69% మందికి …
Read More »