ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. సీఎం జగన్, పలువురు మంత్రులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు(మ) కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో అయ్యన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదులో కోటేశ్వరరావు పేర్కొన్నారు.
Read More »టీటీడీ పాలక మండలి జాబితా విడుదల
టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, …
Read More »జగన్ పై లోకేష్ విమర్షల వర్షం
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా పని చేశారు.
Read More »నిరుద్యోగ యువతకు ఏపీ సర్కారు షాక్
ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు. అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. …
Read More »ఏపీ సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుందా..?..2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనా..?
ఇది చదవడానికి కాస్త విడ్డూరంగా ఉన్న కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను.. ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అవుననే చెప్పాలి. ఇటీవల ఒక ప్రముఖ జాతీయ మీడియా చెపట్టిన సర్వేలో టాప్ టెన్ లో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్థానం లభించకపోవడం కూడా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇమేజ్ మసకబారుతుందని చెప్పొచ్చు.. గత సార్వత్రిక ఎన్నికలకు …
Read More »ఏపీ పాలిసెట్-2021 తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని …
Read More »ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్టు 14 వరకు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.
Read More »తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు
తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …
Read More »