ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్
ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు – వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.
Read More »బీజేపీకి షాకిచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ
ఏపీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం నాడు జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడులో సమావేశాలు కొనసాగుతున్నాయి… అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. తన అనుచరులతో కలిసి …
Read More »సీబీఐ కి షాకిచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి
ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపిన సంగతి విదితమే. అయితే సీబీఐ పంపిన నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి స్పందించారు. ‘నిన్న రాత్రి నోటీసులు పంపి ఇవాళ విచారణకు రమ్మంటే ఎలా? నేను 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసుపై తొలిసారిగా అవినాష్ రెడ్డి స్పందన
ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అధికార వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘రెండున్నరేళ్లుగా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా. నేనేమిటో ప్రజలకు తెలుసు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. ఆరోపణలు చేసేవారు ఆలోచించాలి. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు …
Read More »టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ …
Read More »టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …
Read More »లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. …
Read More »