ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »సీఎం జగన్ అసంతృప్తి
కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు. టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల …
Read More »బాబుపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్రంలోని గుంటూరులో కేసు నమోదైంది. న్యాయవాది అనిల్కుమార్ ఫిర్యాదుతో అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. కరోనాపై ప్రజలను భయపెట్టేలా మాట్లాడారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలు పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
Read More »రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.
Read More »ఏపీ,తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం ఇదే..?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఆప్డేట్ – వైసీపీకి తిరుగులేదు
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన వైసీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్‌లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,24,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,50,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 23,223 ఓట్లు పోలయ్యాయి.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి …
Read More »ఇందండీ చంద్రబాబు తీరు.. వాళ్లు చేయరు.. జగన్ ను చేయనీయరు..!
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను జెట్ స్పీడుతో ముందుకెళుతున్నాయి. లాక్డౌన్.. కరోనా టైంలోనూ పోలవరం పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగుతున్నాయి. దీనిని చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో(పచ్చమీడియా) పోలవరానికి అవినీతి మరలు అంటించేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా పోలవరం నిర్మాణంపై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఒక అబద్దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. పోలవరం జలాశయంలో ప్రస్తుతం …
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత
ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
Read More »