ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని …
Read More »ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్టు 14 వరకు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.
Read More »TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.
Read More »నిరుద్యోగులకు అండగా నారా లోకేష్
ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.
Read More »తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు
తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …
Read More »ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశారు. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. ఆ తర్వాతి నుంచి ప.గో, తూ.గో జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో సా.6 గంటలకే షాపులు మూసివేయాలి. మిగతా జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 10 వరకు (షాపులు 9కే మూసివేయాలి) సడలింపులు ఇవ్వగా.. పాజిటివిటీ రేటు 5%లోపు వచ్చేంత …
Read More »చుక్క నీటినీ వదులుకోం- ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తినీ ఆపం
కృష్ణా జలాల్లో తమ వాటాకింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. జల విద్యుదుత్పత్తిని కూడా ఆపేదిలేదని స్పష్టంచేసింది. తెలంగాణ హక్కులను కాలరాస్తూ.. ఎలాంటి కేటాయింపులు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న నేపథ్యంలో గతంలో స్నేహపూర్వకంగా చేసుకున్న అవగాహన ఒప్పందాలు ఇక చెల్లవని.. కృష్ణా జలాల్లో కచ్చితంగా చెరిసగం వాటా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ వ్యవసాయం, రైతుల …
Read More »ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక మహిళా పోలీసు..
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.
Read More »