ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే …
Read More »వంగవీటి రాధ హత్యకు రెక్కీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేత వంగవీటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని, రెక్కీ నిర్వహించారని అన్నారు. తనను చంపాలని చూసినా భయపడనని, దేనికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని, వంగవీటి రంగా ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లా చిన్నగొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ …
Read More »AP లో 82కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »అందులో ఏపీ ముందు
ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి …
Read More »ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్
ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శుక్రవారం ఎన్జీటీ తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే …
Read More »ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సంచలన నిర్ణయం
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read More »ఏపీలో కొత్తగా 132 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఏపీ డిప్యూటీ సీఎం కి అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
Read More »వైసీపీకి బాబు సవాల్
ఏపీ ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం …
Read More »