ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్లో కీలక బాధ్యతలు, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాషాయం పార్టీ.. చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్
ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.
Read More »AP BJPకి షాక్
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నానని, పార్టీ నేతలు అన్యథా భావించవద్దని ఆయన తన రాజీనామా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల… కొన్ని నెలల …
Read More »ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై సంచలన తీర్పు
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులు, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మి వేసిన గృహ హింస కేసు రుజువైంది. దీంతో ఆమెకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే పిటిషనరు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది. లేదంటే నెలకు రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది.
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.
Read More »బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎప్పుడు ఏదో ఒక అంశంతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ నేత.. మాజీ మంత్రి .. తెలంగాణ టీడీపీ సీనియర్ మాజీ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం కేంద్ర హోమ్ …
Read More »