వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని …
Read More »వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు)ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో వైకాపా అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడినంటూ పోలీసులకు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేశారు.
Read More »వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్‌చంద్రబోస్ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …
Read More »నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ
తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …
Read More »ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …
Read More »క్విట్ ఏపీ.. క్విట్ మంగళగిరి అని వాళ్లిద్దరినీ పంపించేశారు: వైవీ సుబ్బారెడ్డి
కరోనా సమయంలోనూ సీఎం జగన్ ప్రజలపై ఆర్థికభారం పడకుండా కాపాడారని టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ పాలన చూసి మూడేళ్లుగా నిద్రపోయిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీకి సీఎంగా జగన్ ఉన్నారంటే అది వైసీపీ కార్యకర్తల సహకారమేనని చెప్పారు. 2014- 2019 వరకు చంద్రబాబు …
Read More »వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్లే..
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లు
Read More »మంత్రి రోజాకు దిష్టితీసిన భర్త సెల్వమణి
వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ …
Read More »కొత్త కేబినెట్‌లో పాతవాళ్లు ఎంతమంది? కొడాలి నాని ఏమన్నారంటే?
ఇటు కేబినెట్‌లో అటు పార్టీలో కొందరు సమర్థులు కావాలని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ ప్రారంభంలోనే చెప్పారన్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌కు తమ రాజీనామాలను సమర్పించామని చెప్పారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. పార్టీలో …
Read More »చంద్రబాబు అలా గెలిస్తే నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా
మంత్రి పదవులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై …
Read More »