ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్ …
Read More »తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్ అవ్వక తప్పదు: బొత్స
తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …
Read More »పవన్.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి
2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …
Read More »పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్.. ఏపీ వ్యాప్తంగా బోర్లకు మీటర్లు: జగన్
ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన …
Read More »బీటెక్ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆధారాలు రుజువు కావడంతో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను శశికృష్ణ హతమార్చాడు. గత ఏడాది ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చకచకా విచారణ చేపట్టి …
Read More »గేర్ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్
మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …
Read More »హైకోర్టు సీజేతో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. సీజేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ భేటీ కావడంతో ఇదే మొదటిసారి. హైకోర్టుకు కొత్త భవనాల నిర్మాణ పనులతో పాటు ఇతర అంశాలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో కోర్టుల్లో …
Read More »వేసవి సెలవులను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read More »విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్ బైక్
విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొన్నాననే ఆనందం ఆవిరైపోవడమే కాకుండా ఆ వ్యక్తిని సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని సూర్యారావు పేటలోని గులాబీతోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి శుక్రవారం కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. బైక్ బ్యాటరీకి శనివారం ఉదయం తన బెడ్‌రూంలో ఛార్జింగ్ పెట్టాడు. అయితే అది ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు …
Read More »