టెన్త్ విద్యార్థులకు లేనిపోనివి చెప్పి వాళ్ల ఆత్మహత్యలకు టీడీపీ నేత నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటి పనులు చేయొద్దని చెప్పేందుకే లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. అమరావతిలో మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. తాను డైరెక్ట్‌గా తన జూమ్ ఐడీతో వెళితే లోకేష్ మాట్లాడరని.. అందుకే తన మేనల్లుడి లింక్‌తో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. టెన్త్ …
Read More »మాల్ ప్రాక్టీస్ లేకుండా కఠినంగా వ్యవహరించాం: సజ్జల
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో …
Read More »పవన్ కల్యాణ్‌కి కేఏ పాల్ బంపర్ ఆఫర్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా …
Read More »వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్‌ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చి ఫిర్యాదులు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నరసాపురం నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో …
Read More »ఏపీలో అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్.. ఆవిష్కరించిన సీఎం జగన్
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు. ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్‌కు రిఫరెన్స్ …
Read More »ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా చంద్రబాబుకు లాభం లేదు: అంబటి
బడుగు, బలహీనవర్గాల పక్షపాతి సీఎం జగన్ అని.. వారికి ఆయన సామాజిక న్యాయం చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి మాట్లాడారు. బస్సు యాత్రకు ప్రతి చోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని.. …
Read More »అదీ జగన్ ఫేస్ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా
టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …
Read More »‘కిక్ బాబు- సేవ్ ఏపీ’.. ఇదే వైసీపీ నినాదం: విజయసాయిరెడ్డి
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజసాయిరెడ్డి నిలదీశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కిక్ బాబు- సేవ్ ఏపీ’ నినాదంతో తమ పార్టీ ముందుకెళ్తోందని చెప్పారు. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కోటంరెడ్డి అరుంధతి వాడలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయన అనుచరులు కోటంరెడ్డిని నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత చెన్నై హాస్పిటల్‌కి …
Read More »అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు!
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘కోనసీమ’ జిల్లా పేరును మార్చవద్దంటూ అక్కడి యువకులు ఒక్కసారిగా భారీ ఆందోళనకు దిగారు. అమలాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్దకు చేరుకుని ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకోగా వారు తప్పించుకుని పరుగులెత్తారు. వారిని పోలీసులు వెంబడించడం.. ఈ క్రమంలో …
Read More »