రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వం, పార్టీ విధానమని స్పష్టం చేశారు. ‘‘మొదటి నుంచీ ఇదే తమ విధామని చెప్తూనే ఉన్నాం. టైమ్ చూసుకుని అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమనేది మా ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స చెప్పారు.
Read More »