ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ సభ్యులు,మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బ్రెయిన్ స్ట్రోక్ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో పిల్లి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.
Read More »కరోనాపై ఏపీ ప్రజలకు శుభవార్త..
ఏపీ ప్రజలకు శుభవార్త కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డా. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 15శాతం పైనే హెర్డ్ ఇమ్యూనిటీ గుర్తించినట్లు తెలిపారు.శనివారం నుంచి శీరోసర్విలెన్స్ భారీగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలని ప్రభాకర్ రెడ్డి …
Read More »ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం
ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడటం.. కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్యకృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ, కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే. తాజాగా ఇలాంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ …
Read More »అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు!
రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. …
Read More »ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ …
Read More »సీఎం జగన్ పిలుపు
ఏపీలోని తాజా కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కరోనా సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కరోనా రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ANM, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం ప్రజలకు కల్పించాలన్నారు.
Read More »దానికోసమే ఏపీకి మూడు రాజధానులు
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న తన ఉక్కు సంకల్పంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఏ మాత్రం రాజీపడడం లేదు. చారిత్రాత్మక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 2014 రాష్ట్ర విభజన లాంటి పరిస్థితి రాష్ట్రంలో మరోసారి రాకూడదని వైయస్ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం తెలిసిందే.. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయపాలనా రాజధానిగా మారుస్తూ సిఆర్‌డిఏను రద్దు …
Read More »ఒక్కడి వల్ల 222మందికి కరోనా
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా …
Read More »చంద్రబాబుపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు …
Read More »