ట్రాన్స్‌ఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. జూన్ 17లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సీఎం సంతకం పూర్తయిన నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.
Read More »మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని
జగన్ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …
Read More »అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల
ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్ …
Read More »టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్
యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »