అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పంట పొలంలో విద్యుత్తు తీగ తెగి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రాయదుర్గం బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు పంట కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్‌లో లోడు చేస్తుండగా.. సమీపంలోని విద్యుత్తు తీగ తెగి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో …
Read More »ఎమ్మెల్సీ శమంతకమణి…మాజీ ఎమ్మెల్యే యామినిబాల టీడీపీని ఏందుకు వీడారో తెలుసా
టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైసీపీలో చేరామని చెప్పారు. తనలాంటి సీనియర్లు చాలా మంది …
Read More »టీడీపీకి గుడ్ బాయ్ చెప్తున్న పరిటాల కుటుంబం
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని, పట్టు కాపాడుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా బలంగా లేని తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఊహించని దెబ్బ కొడుతున్నారు. చంద్రబాబు నమ్మిన వాళ్ళే ఇప్పుడు ముంచుతున్నారు. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా పార్టీ మారడానికి పరిటాల ఫ్యామిలీ కూడా సిద్దమైంది. శ్రీరాం ఇప్పటికే జిల్లా మంత్రిని …
Read More »అనంతపురంలో మహీంద్రసింగ్ ధోని ..ఘన స్వాగతం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ధోని పర్సనల్ డాక్టర్ ముత్తు.. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చి పుట్టపర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి …
Read More »చంద్రబాబుకు మరో షాక్ ..టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి చేరిక
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు. అనంతపురం జిల్లా పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా …
Read More »అనంతపురంలో ఉద్రిక్తత
పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిరసన సెగలు వెంటాడుతున్నాయి. తాజాగా అనంతపురం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలోని కొడికొండలో ఉద్రిక్తత నెలకొంది. కొడికొండలో చంద్రబాబును ప్రజా సంఘాలు, స్థానికులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో …
Read More »చంద్రబాబు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..వైసీపీ ఎమ్మెల్యే సవాల్
ఎన్నికలలో మళ్లీ తీర్పు కోరిన తర్వాతే రాజదానిపై నిర్ణయం చేయాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఆయన సవాల్ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ …
Read More »దివాకర్ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా సీజ్
రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు సీజ్ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్‌రెడ్డి, మణి, అనంతపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్7699 నంబర్ గల దివాకర్ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా …
Read More »రేపు అనంతపురం జిల్లాకు సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్ నేతన్న నేస‍్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు.
Read More »మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు…పవన్ కళ్యాణ్
మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆయన పార్టీ నేతల మీటింగ్ లో జవాబు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి ఏడు చేపల కథ చెబుతారు. అవన్నీచట్టబద్దంగా జరిగాయి. చట్టబద్దంగా చేయని మీ చీకటి వ్యవహారాలు నేనుబయటపెడితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు. అనంతపురం జిల్లాకి …
Read More »