అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
Read More »అమూల్ సంస్థ రావడం గర్వకారణం -మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బేకరీ తయారీ ప్లాంటును అమూల్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణానికి మొదటి దశలో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు …
Read More »