ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో 2022 మార్చి 31 వరకు గృహాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చు. అలాగే అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పెరగనుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇంటి రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై కేంద్రం రాయితీ అందిస్తోంది.
Read More »సామాన్యుడికి షాకిచ్చిన 2021-22కేంద్ర బడ్జెట్
బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది
Read More »కేంద్ర బడ్జెట్ 2021-22తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..?
-తగ్గనున్న బంగారం, వెండి ధరలు -పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు -మొబైల్ రేట్లు పెరిగే అవకాశం -నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం -సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు -ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం
Read More »వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఎందుకంటే..?
దేశంలోని లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం …
Read More »స్వస్త్ భారత్ హెల్త్ స్కీమ్ కి ఎన్ని కోట్లు కేటాయించారంటే..?
ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వస్త్ భారత్ యోజన పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ కొత్త పథకం కోసం 64,180 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌సభలో బడ్జెట్ …
Read More »కేంద్ర బడ్జెట్ 2021 -రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ది చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల నిధులు అందించనున్నారు. దేశీయ విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read More »కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టాబ్లెట్‌లో ఏముందో తెలుసా..?
కరోనా నేపథ్యంలో తొలిసారి డిజిటల్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. స్వదేశీ ‘బాహి ఖాతా (బడ్జెట్)’ను టాబ్లెట్‌లో సమర్పించారు. పసిడి వర్ణంతో కూడిన మూడుచక్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ చీర ధరించి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు వెంటరాగాపార్లమెంట్‌లో అడుగు …
Read More »తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీ, ఆదాయం లేని రైల్వేస్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 29 స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నవాడ్గి, అంక్షాపూర్, మారుగుట్టి, పోడూరు, మామిడిపల్లి, కట్టాలి, కట్లకుంట మేడిపల్లి, మైలారం, మహాగనాన్, కొత్తపల్లి హావేలి, చిట్టహాల్ట్, నందగాన్ హాల్లి, గేట్ కారేపల్లి, నూకనపల్లిమల్యాల్, నగేశ్‌వాడి హాల్ట్, మృట్టి హాల్ట్, వలివేడు, …
Read More »మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా..?
ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది కొత్త రూ. 100 నోట్లు మాత్రమే చలామణీలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు RBI వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు. అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా బ్యాంకు ఆపేసింది.
Read More »ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్
ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్రజలకు ప‌్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More »