గుజరాత్ తీరంలోని పిపావావ్ పోర్టులో దాదాపు 90 కిలోగ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి ఆమ్రేలి జిల్లాలోని పిపావావ్ పోర్టుకు చేరుకున్న ఓ షిప్పింగ్ కంటెయినర్ నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రత్యేక పద్ధతి అవలంబించారని డీజీపీ అశిష్ భాటియా తెలిపారు. హెరాయిన్ ఉన్న ద్రావణంలో దారాలను నానబెట్టి, …
Read More »తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతాం
తెలంగాణ భవన్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని స్పష్టం చేశారు.తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్ ఏర్పడి 62 ఏండ్లైనా కరెంట్ కష్టాలున్నాయి. ఎనిమిదేండ్లలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంక్షేమం మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్న …
Read More »తెలంగాణ పట్ల ఆగని మోదీ వివక్ష: మంత్రి కేటీఆర్
నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి …
Read More »ఓబీసీలకు మోదీ సర్కారు శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఓబీసీలకు శుభవార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఇందులో భాగంగా ఓబీసీల ఆదాయపరిమితిని రూ.10 లక్షలకు పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2017లో రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది బీజేపీ ప్రభుత్వం. తాజాగా దేశంలో ఉన్న పలు వివిధ రాజకీయ పార్టీలు ఈ పరిమితిని …
Read More »BJP కి దిమ్మతిరిగే షాక్
దేశంలో నాలుగు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ..ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు ఓటర్లు. ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు 101 స్థానం
ప్రపంచ ఆకలి సూచీ-2021 ప్రకారం భారత్ 101వ ప్లేస్లో నిలిచింది. మొత్తం 116 దేశాల్లో సర్వే నిర్వహించగా.. మనకంటే పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76), మయన్మార్(71) మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. చైనా సహా 18 దేశాలు టాప్ ఉన్నాయి. ఇక 2020లో భారత్ 94వ స్థానంలో ఉండగా తాజాగా 7 స్థానాలు దిగజారింది. ఆకలి, పౌష్టికాహార లేమి తదితర అంశాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ …
Read More »మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పయనమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటీవలే కేంద్రానికి వ్యతిరేకంగా హస్తినలో ధర్నా చేసిన ఆయన.. బీజేపీపై పోరులో భాగంగా రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి వారం రోజులు అక్కడే ఉండి కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన యూపీ వెళ్లి లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది.
Read More »దేశ్ కీ నేత సీఎం కేసీఆర్.. వెలువెత్తిన అభిమానం
ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు ఢిల్లీకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. రైతన్న కోసం పోరాడుతున్న కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నెత్తిన వడ్ల బస్తా.. ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన …
Read More »అమిత్ షా కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశం బలం.. అందుకే భారతదేశం వసుదైక కుటుంబం అయింది. ఏం తినాలో ఏం వేసుకోవాలో ఎవర్ని పూజించాలో ఏ భాష మాట్లాడాలో అనేది ప్రజలను నిర్ణయించుకొనివ్వండి. భాష ఆధిపత్యం ఎప్పటికీ చెల్లదు. నేను ముందు భారతీయుడిని , తర్వాతే తెలంగాణ బిడ్డను. నా మాతృ భాష తెలుగు, నేను …
Read More »బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వంపై మహరాష్ట్ర అధికార పార్టీ అయిన శివసేనకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్రలోని ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీకి చెందిన కొంతమంది నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కీరత్ సోమయ్య నాయకత్వంలో ఈ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. మరాఠీ భాష …
Read More »