రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్(సెక్యులర్) ఒంటరిగా పోటీ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూటమి ఉండదని ఆయన స్పష్టం చేశారు. బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని, అయిదు లేదా ఆరు లేదా ఒక్క సీటు గెలిచినా పర్వాలేదని దేవగౌడ తెలిపారు. బలంగా ఉన్న చోటే తమ అభ్యర్థుల్ని …
Read More »మణిపూర్ నగ్న వీడియోపై సీఎం సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా అలజడి రేపిన మహిళల నగ్నంగా ఊరెగింపు వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదయింది. వీడియో కూడా దొరికింది. కానీ పార్లమెంట్ సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు. ఇందులో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్లో బీజేపీ సర్కారు ఉండటం వల్లే …
Read More »మణిపూర్ లో మరోదారుణం
మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన జరిగిన అదే రోజు మరో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్ పీక్సీ ప్రాంతంలో కార్ సర్వీస్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించినట్లు.. అక్కడ యువతులు చనిపోయినట్లు, వారి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది.
Read More »లోక్ సభ రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సభ ప్రారంభమైన మొదట్లో లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే లోక్ సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా …
Read More »దేశంలో అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు వీళ్లే..?
ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి. వారిలో ముగ్గురికి రూ.1000 …
Read More »ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.
Read More »ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రాకపోకలు …
Read More »తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు -కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని …
Read More »ప్రధాని మోదీపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ …
Read More »ప్రధాని మోదీ,సీఎం యోగి పై చర్చ వల్ల ఓ నిండు ప్రాణం బలి
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు.. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.. దీంతో రాజేష్ ను కారు …
Read More »