కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు …
Read More »చిక్కుల్లో కేరళ సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సీఎం విజయన్ కుమార్తె వీణకు ఓ ప్రైవేట్ కంపెనీ రూ కోటి ఏడు లక్షలు చెల్లించడంపై న్యాయ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె వీణకు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీతో కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ సరిగ్గా ఏడేండ్ల కిందట ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సేవలు లేకుండా వీణ ,ఆమె కంపెనీకి ప్రతి నెలా …
Read More »నీకు దమ్ముంటే బిల్కిస్ బానోతో రాఖీ కట్టించుకో- ప్రధాని మోదీకి మహా మాజీ సీఎం థాకరే సవాల్
నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) సభ్యులందరూ ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్రమోదీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లింల విషయంలో బీజేపీది, ఆ పార్టీ నేతలది ఎప్పుడైనా ద్వంద్వ వైఖరేనని మండిపడ్డారు. ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య మతచిచ్చు రేపుతూనే మరోవైపు ముస్లింలపై ప్రేమ ఒలకబోయడం బీజేపీ నేతల …
Read More »ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ సర్కారు వివరణ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ …
Read More »బీజేపీకి షాక్
గుజరాత్‌లో బీజేపీ పార్టీకి చెందిన జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింహ వాఘేలా రాజీనామా చేశారు. ఆ పోస్టుకు రాజీనామా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో అన్నీ సర్ధుకుంటాయన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్లు ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రజినీభాయ్ పటేల్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని, అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ఇటీవల వాఘేలా పేర్కొన్నారు.
Read More »తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,23,396 మందికి ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలు సృష్టించినట్టు మంత్రి కేటీఆర్ అసెంబ్లీసాక్షిగా వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నిలదొక్కుకోవడంతో ఎకరం రూ.వంద కోట్లు పలికే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్‌షీప్ ఉన్నందునే ఇది …
Read More »30 నిమిషాలు కూర్చోలేరు.. 30 రోజులు సభ పెట్టాలా?- మంత్రి కేటీఆర్
అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన ప్రతిపక్ష సభ్యులు లాబీల్లో టైమ్‌పాస్ చేస్తున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడైనా ప్రతిపక్షం తమ పాత్ర సరిగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో కనీసం 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదని ఎద్దేవా చేశారు. ఎస్సార్డీపీపై ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చే సమయంలో కాం గ్రెస్, బీజేపీకి చెందిన …
Read More »గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షత
దేశంలో ఉన్న గిరిజనుల పట్ల ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సాక్షిగా విమర్శించారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న మణిపూర్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో …
Read More »శాసనమండలిలో సర్కారు బడుల విద్యార్థులు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ …
Read More »లోక్‌సభలో కేంద్రంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ …
Read More »