ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …
Read More »సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు నిన్న శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్ …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి సుచరిత పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి సుచరిత స్పందించారు. తాను మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటాను. పార్టీ మారితే ఇంటికే పరిమితం అవుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ …
Read More »నెల్లూరు జిల్లా వైసీపీలో పెను దుమారం
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల వివాదం ఇంకా తీవ్రరూపం దాల్చుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీలో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో ఆయన చేసిన రాజ్యాంగంపై వ్యాఖ్యల గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని మండిపడ్డారు. వయసు …
Read More »ఏపీలో దారుణం-టీడీపీ నేతపై కాల్పులు
ఏపీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మండలాధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి వెళ్లిన ప్రత్యర్థులు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డిని ఆయన కుటుంబసభ్యులు వెంటనే నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన జరిగిన …
Read More »ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో టూర్ ఖరారైంది. ఈ నెల 11న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Read More »తారకరత్న ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనైన సినీనటుడు తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్న తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్‌డేట్ అందించారు. ఆయన ఇవాళ బెంగళూరులో ఆస్పత్రి ప్రాంగణంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తీవ్ర గుండెపోటుకు గురైన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. అయితే చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్మ్ ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరిద్దరూ బెంగళూరుకు బయల్దేరారు. ఇప్పటికే …
Read More »పాదయాత్రలో నారా లోకేష్ కు షాక్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. పాదయాత్రలో భాగంగా కుప్పంలో నారా లోకేష్ కు స్థానిక టీడీపీ కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో బీసీలకు పథకాలు అందలేదు. కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని.. తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఓ టీడీపీ …
Read More »ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి తీవ్ర అస్వస్థత
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర గుండెనొప్పి రావడంతో రాష్ట్రంలోని విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు.. ఈ సందర్భంగా అర్జునుడుకు వైద్యులు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువగా ఉన్నందున విషమంగానే బచ్చుల ఆరోగ్యం ఉండగా.. 24 గంటలు గడిచాక మరోసారి డాక్టర్లు ఆయన పరిస్థితి సమీక్షించనున్నారు.
Read More »