పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.
Read More »కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
ఏపీలోని కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది.
Read More »బుల్లెట్ కలకలం కేసు- విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్
మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్రయాణికుడి బ్యాగులో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్‌ను గుర్తించారు. దీంతో విచారణ నిమిత్తం బుల్లెట్‌ను, సదరు ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇతడి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు. లైసెన్స్ …
Read More »ముగ్గురికి కరోనా..80వేల మంది తరలింపు
కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ. వియత్నాంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వియత్నాంలో తాజాగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం దనాంగ్ సెంట్రల్ టూరిజం హాట్ స్పాట్ గా ప్రకటించింది. దీంతో అక్కడ నుండి దాదాపు 80 వేల మంది పర్యాటకులను తరలించింది. కాగా రోజుకు విమానాల్లో దనాంగ్ కు దాదాపు 100 వస్తుంటారు.
Read More »శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైఅలెర్ట్ ప్రకటించిన అధికారులు !
తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పై అధికారులు డేగ కన్ను పెట్టారు. నిన్న సుమారు 1500మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండడంతో అడనపు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రయాణికులు లేక మొత్తం వెలవెలబోతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రదేశం మొత్తం జనసంచారం లేక కాలిగా కనిపిస్తున్నాయి. ఇక విదేశాల నుండి వస్తున్న …
Read More »ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !
ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది. ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. …
Read More »విశాఖకు భారీ గుడ్ న్యూస్..!
విశాఖ విమానాశ్రయ చరిత్ర మరో మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని విమానాశ్రయం నుండి ఇకపై చెన్నై, కోల్ కతా వంటి ప్రాంతాలకు కార్గో విమానాలను సైతం నడుపుకునేందుకు కేంద్ర రక్షణశాఖ అనుమతినిచ్చింది.. విశాఖ నుండి ఇకనుండి రవాణా విమానాలు నడిపించేందుకు ప్రముఖ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ముందుకొచ్చింది. ఈనెల 15నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి ఉన్నా.. రక్షణశాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యంగా రావడంతో సర్వీసుల ప్రారంభం …
Read More »విమానాశ్రయంలో దొరికిన వేరుశనగకాయలు…45 లక్షలు డబ్బు చూసి షాకైయిన పోలీసులు
వేరుశనగకాయలు, మాంసపు ముద్దలు, బిస్కెట్లు.. ఇంకా పలు రకాల తినుబండారాల్లో విదేశీ కరెన్సీని దాచిపెట్టి తీసుకువెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో మురాద్ ఆలమ్ అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఆ విదేశీ కరెన్సీ విలువ సుమారు 45 లక్షలు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. పల్లికాయలు, మాంసపు ముద్దలు, బిస్కెట్ ప్యాకెట్లలో అతను ఎలా డబ్బును దాచాడో …
Read More »హీరో రాజశేఖర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…!
శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గత రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ కు కారులో వస్తున్న …
Read More »రేవంత్ ఇజ్జత్ మొత్తం తీసేసిన అమెరికన్లు..!
తాను పులిబిడ్డనని…తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేతనని తనది తాను డబ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇటు పార్టీలో నేతల సహకారం లేక…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది పడుతున్న రేవంత్‌కు…అటు ఆదరణ విషయంలోనూ అదే రీతిలో పరేషాన్ అవుతున్నారని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయనకు ఎదురైన అవమానం నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో …
Read More »