దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్‌తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »పశువులకు కూడా ఆధార్ నంబర్
దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్‌లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్‌యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …
Read More »అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించాయి. నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్‌లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో …
Read More »