తెలంగాణలో తినేందుకు ఆలుగడ్డను అధికమొత్తంలో వినియోగిస్తారని.. ఇక్కడ ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉండాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంటలసాగుపై సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేవలం ఐదారు వేల ఎకరాల్లోనే ఆలుగడ్డలను పండిస్తున్నారని.. అందుకే యూపీ, గుజరాత్, పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 65 నుంచి 70 రోజుల్లోనే ఆలు …
Read More »పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్.. ఏపీ వ్యాప్తంగా బోర్లకు మీటర్లు: జగన్
ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన …
Read More »కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి: కేసీఆర్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …
Read More »తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూన్ 14 నుంచి 20వరకు ఎంసెట్, జులై 13న ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. ఎంసెట్‌కు ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు, ఈసెట్‌కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, జులై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాల్లో ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. తెలంగాణ …
Read More »దేశమంతా ఒకే విధానం ఉండాలి: మోడీకి కేసీఆర్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని …
Read More »అందులో ఏపీ ముందు
ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి …
Read More »టీఎస్ ఎంసెట్ గడువు పెంపు
తెలంగాణలో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం …
Read More »ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డు
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని, రాష్ట్ర విభజన అనంతరం అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్‌గుప్తా చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టి, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టాల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేరళ, కర్ణాటకలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలకు కూడా …
Read More »2018 చంద్రబాబు అక్రమ పాలనకు అంతంగా ప్రజలు భావిస్తున్నారా.?
ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగినా.. బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో ఎక్కడికక్కడ పూర్తి వ్యతిరేకతే ఎదురైంది. అధికార టీడీపీ మంత్రులు, …
Read More »100హామీల్లో ఈ యేడాది ఎంతవరకూ చంద్రబాబు పనులు చేసారు.? సంక్షేమం, అభివృద్ధి ఏవిధంగా నడుస్తోంది.?
2018 సంవత్సరం మరికొద్దిరోజుల్లో పూర్తి కావస్తోంది. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పోలవరం సహా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 20శాతం కూడా నెరవేరలేదంటే ఆయన పాలన ఎంత అధ్వాన్నమో అర్థం చేసుకోవచ్చు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా దీక్షలు, కడప స్టీలుప్లాంటు విషయంలో కేంద్రం నుంచి అనుమతులు, రైల్వేజోన్ వంటి అతి ముఖ్యమైన విషయాల్లోనూ చంద్రబాబు ఒక్కచోట …
Read More »