అఫ్గానిస్తాన్ లో ఇప్పటికే మహిళలకు విద్య, ఉపాధిని దూరం చేసిన తాలిబన్లు తాజాగా మరో కొత్త రూల్ అమలు చేశారు. ఔట్ డోర్ రెస్టారెంట్లలో మహిళలను అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. హిజాబ్ ధరించకపోవడం, పురుషులతో మహిళలు కలిసి కూర్చోవడంపై పెద్దలు ఆక్షేపణ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. ప్రస్తుతం హెరాత్ ప్రాంతంలో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.
Read More »మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ
ఆసియాకప్ నామమాత్రమైన మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల నుంచి అత్యద్భుత ప్రదర్శన. ఓవైపు అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 నాటౌట్) తొలి శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో పేసర్ భువనేశ్వర్ (4-1-4-5) నిప్పులు చెరిగే బంతులతో తన ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి గురువారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 101 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. అలాగే టీమిండియా ఆసియాక్‌పను …
Read More »పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు
నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు. కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే …
Read More »తాలిబన్లు సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.
Read More »న్యూజిలాండ్ ఘన విజయం
T20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో న్యూజిలాండ్ సమిష్టిగా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఫలితంతో అఫ్గాన్‌తో పాటు టీమ్‌ఇండియా సెమీస్ దారులు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (48 బంతుల్లో …
Read More »టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో.. బోణీ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్ అర్ధ శతకాలతో.. గ్రూప్-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత …
Read More »ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం -ఒక వాటర్ బాటిల్ దాదాపు రూ.3వేలు..ప్లేట్ రైస్‌కు రూ.7500
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు …
Read More »ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్‌కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. …
Read More »నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఅఫ్గానిస్థాన్
పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ గుల్బాడిన్ నైబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్ చేరేందుకు పాకిస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది. అఫ్గానిస్థాన్ జట్టు: గుల్బాడిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, …
Read More »