ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.
Read More »నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు …
Read More »