తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.
Read More »తమిళనాడు ఎన్నికల ఫలితాలు -సీన్ రివర్స్ -నువ్వా.. నేనా..?
తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. డీఎంకేకు పళనిస్వామి ఆధ్వర్యంలోనే అన్నాడీఎంకే గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉదయం 10.45 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం డీఎంకే కూటమి 94 స్థానాల్లో …
Read More »తమిళనాడులో గెలుపు ఎవరిది..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read More »‘ఎన్నికల్లోపు డీఎంకే కూటమి ఖాళీ’
డీఎంకే ఒక ఆన్‌లైన్ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుందన్నారు. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం …
Read More »తెలంగాణ బాటలో తమిళనాడు
పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.
Read More »డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్ మృతి
డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »అదిరిపోయిన కంగనారనౌత్ గెటప్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది. కంగనా …
Read More »బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …
Read More »రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు
సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …
Read More »రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం,అన్నాడీఎంకే అధినేత జయలలిత స్నేహితురాలు.. ఆ పార్టీ నేత శశికళ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. శశికళకు చెందిన సుమారు మొత్తం రూ.1600 కోట్ల విలువ చేసే ఆస్తులను పది కంపెనీల్లో సోదాలు నిర్వహించి బినామీ చట్టం కింద అటాచ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ళుగా బెంగుళూరులోని అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే
Read More »