రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. మొదటినుంచీ హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణా కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160కింద ఆదినారాయణ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ యేడాది మార్చి 15న పులివెందులలో వివేకా …
Read More »కడప మాజీ మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదిరిపోయే సెటైర్..!
కడప జిల్లాలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేకు ఆదినారాయణరెడ్డికి ఆసుపత్రి మందుల కంటే మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచి, అధికారం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి పదవే వెలగబెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జమ్మలమడుగు టికెట్ ఆదికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. జిల్లాలో గెలవడం కష్టసాధ్యమైన కడప …
Read More »చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …
Read More »చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి…అందుకే ఓడిపోయా
మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం నేత ఆదినారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను హైదరాబాద్ లో కలవడం మరింత ఊతమిచ్చింది. నడ్డానుకలసి వచ్చిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అయినట్లు సమచారం. తన అనుచరులతో సమావేశమై …
Read More »లోకేశ్, చంద్రబాబు, ఆది నారాయణే చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. వివేకా హత్య
పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన వైసీపీ నేత సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైనా కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందా అనే అనుమానాలు …
Read More »చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మాజీ మంత్రి…కడప టీడీపీ ఖాళీ…?
కడప టీడీపీ కుప్పకూలుతుందా..గత ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన తెలుగుదేశం పార్టీ…కడపలో పూర్తిగా సమాధి కాబోతుందా..జిల్లాలో కీలక నేతలంతా కాషాయ గూటికి చేరుకుంటున్నారా…ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. తాజాగా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్లే తాను కాషాయతీర్థం పుచ్చుకున్నట్లు ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో …
Read More »చంద్రబాబుకు అతి పెద్ద దెబ్బ..మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకు …
Read More »కడపలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిన నేతలు..ఎందుకు ఏకమయ్యారో తెలిస్తే షాకే
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ ప్రవేశ పెడితే స్థానిక నాయకులు ఆయా ప్రాంతాల్లో తమకు అనువైన ట్యాక్స్‌లు అమలుచేశారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు చేపట్టాలంటే దేవగుడి–గుండ్లకుంట ట్యాక్స్ చెల్లించాల్సిందే. చెల్లించకపోతే పనులు చేయడం కష్టమే. ఇలాంటి తంతు గడిచిన మూడేళ్లుగా కొనసాగింది. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం మొదలుకొని ఎలాంటి పనులు చేపట్టినా 50@50వాటాలతో చెపట్టాల్సిందే. ఇలాంటి ఒప్పందం ఏకంగా అప్పటి ప్రభుత్వ పెద్దే కుదిర్చారు. అదే విషయాన్ని తమ …
Read More »వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆదినారాయణరెడ్డి హస్తం..!
కడప జిల్లాలో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. …
Read More »వైఎస్ జగన్ దెబ్బ అదుర్స్… టీడీపీకి ఆదినారయణ రెడ్డి గుడ్ బై
ఆనాడు పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు …
Read More »