ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.
Read More »ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు. ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని …
Read More »