తెలంగాణ రాష్ట్రంలో నేడు సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు త్రివర్ణ జెండాను ఎగురవేయనున్నారు.
Read More »నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధాన్యత-మంత్రి జగదీష్
డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా యావత్ రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవొచ్చని ఆయన పేర్కొన్నారు. వానాకాలం పంటలపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,స్థానిక శాసనసభ్యులు …
Read More »నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత …
Read More »రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలే…కేటీఆర్
శనివారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువటంకాకుండా.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాహుల్‌కు హితవుపలికారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. రాహుల్, నరేంద్రమోదీ …
Read More »