దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పేరున్న అందరూ 2023 ఏప్రిల్ 1లోగా తమ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరూ 6B ఫారం ద్వారా తమ ఆధార్ నంబర్ ను సంబంధిత ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. అయితే ఈ అనుసంధాన ప్రక్రియ ఐచ్ఛికమే అని.. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆధార్ లేకపోతే ఎన్నికల అధికారులు కోరే ఇతర డాక్యుమెంట్లను 6B ఫారం …
Read More »టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై 6 నెలల్లో టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫాస్టాగ్ స్థానంలో GPS లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని రోడ్లు USతో సమానంగా ఉంటాయన్నారు.
Read More »బీజేపీ ముసుగు తీసేసిన జేపీ నడ్డా
భిన్నత్వంలో ఏకత్వం.. ఇదే భారతదేశం ఆత్మ. సుదీర్ఘ పరాయి పాలనను తుదముట్టించి 75 ఏండ్ల కింద బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించిన భారత్.. ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ ఉదాహరణగా కొనసాగుతున్నది. అందువల్లే జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు.. చిన్న చిన్న పార్టీలు సైతం మనగలుగుతున్నాయి. ఇంతటి విశిష్ట భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదనే విమర్శలున్నాయి అంటూ తాజాగా బీజేపీ పార్టీ …
Read More »MP సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి
శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. పత్రాచల్ కేసులో ఆధారాల కోసం ఆదివారం ఉదయం నుంచి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి సంజయ్‌రౌత్‌ను వించారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. Mumbai | Enforcement Directorate officials at Shiv Sena leader Sanjay Raut's residence, in connection with Patra Chawl …
Read More »మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా ఈ రోజు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోను.. తాను ఎప్పటికి స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రతిపక్షాలు తమ రాష్ట్ర అభ్యర్థిగా బరిలో …
Read More »ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయంలో ఆమె వెంట రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి …
Read More »సోనియా గాంధీ ఏమైనా సూపర్ హ్యూమనా?:
దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో విపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమా? కాదా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ (సోనియా గాంధీ) ఏమైనా సూపర్ హ్యూమనా? వారు (కాంగ్రెస్) చట్టానికి అతీతం అని భావిస్తున్నారా?’ అని ఎంపీలపై మండిపడ్డారు.
Read More »ఆస్పత్రిలో చేరిన పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో సీఎంకు నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Read More »కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు-కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర విభాగాల్లో మొత్తం మంజూరు పోస్టులు సంఖ్య 40.35 లక్షలు కాగా, వాటిలో 9.79 లక్షలు ఖాళీగా ఉన్నాయంటే.. …
Read More »ఆహార పదార్థాలపై జీఎస్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »