నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ …
Read More »చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడి ఆ రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని
కర్నూల్ జిల్లా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధానికి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజధాని అంటే అన్ని ప్రాంతాల ప్రజలకు భావోద్వేగ అంశమని, అలాంటిది అమరావతిలో నాయుడు రియల్ ఎస్టేట్ రాజధానిని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »సీఎం జగన్ కు జైకొట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెసిన ప్రకటన టీడీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్వాగతించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నానని ,ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటినుంచి కోరుతున్నానన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న వ్యాఖ్యానించారు. కాగా మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ వ్యతిరేకిస్తున్న క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి జగన్ కు మద్దతివ్వడం చర్చనీయాంధంగా మారింది. ఇప్పటికే …
Read More »ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …
Read More »సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నా..నంద్యాల ఎమ్మెల్యే
ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు చెప్పారని, అయితే అప్పట్లో అలా చేయడం …
Read More »రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రకటనలు చేసినా మీ నాయకులను బయట తిరగనీయబోమని హెచ్చరిక
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాయలసీమ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, పవన్ దిష్టిబొమ్మలతో గురువారం కర్నూలులో శవయాత్ర నిర్వహించి కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, సునీల్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నంత …
Read More »వైఎస్ జగన్ ని అభినందించాలని చెప్పిన మరో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకుడు వ్యతిరేకిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు టీడీపీ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అభినందించాలని, ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. గురువారం ఓ మీడియా చానల్‌తో …
Read More »తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు..సీఎం జగన్ న్యాయం
ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్ వల్ల న్యాయం జరుగుతుందని కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల …
Read More »కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజదాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నపవన్ కళ్యాణ్
కర్నూలులో హైకోర్టు, విశాఖలో కార్యనిర్వాహక రాజదాని ఏర్పాటు ఆలోచనపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా?అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీజన్లో కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా, సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలన్నమాట.మూడు …
Read More »సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాజదానితో సహా జగన్ ప్రబుత్వం అన్ని విషయాలలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసూయ,అక్కసులతో బురద చల్లే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన స్వాగతించదగినదని ఆయన అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ప్రభుత్వం ఆదారాలతో సహా బయటపెట్టిందని …
Read More »