Home / Tag Archives: 24×7 Emergency Helpline for Indians in Ukraine.

Tag Archives: 24×7 Emergency Helpline for Indians in Ukraine.

ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్

ఒకవైపు ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కార్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఆర్డెర్ లను  తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది,న్యూజిలాండక్కు చెందిన 130 …

Read More »

యుద్ధం ఆపేందుకు రష్యా మరో ప్రతిపాదన

 ఉక్రెయిన్ దేశంపై  రష్యా చేస్తున్న యుద్ధం ఆపేందుకు మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవల పుతిన్, జెలెన్ స్కీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఉక్రెయిన్లోని బుచాలో రష్యా …

Read More »

ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి ప్రధాని మోడీ

ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యుద్ధంపై భారత వైఖరిని క్వాడ్ సభ్యదేశాలు ( JAPAN, USA, AUS, IND) అంగీకరించినట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది. తన కాంటాక్టుల ద్వారా. మోడీ యుద్ధాన్ని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. నేటి మోడీ.. AUS ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో యుద్ధం అంశం ప్రస్తావనకు రానుంది.

Read More »

రష్యాకు అంతర్జాతీయ కోర్టు షాక్

గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను  ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా …

Read More »

ఉక్రెయిన్ సంచలన నిర్ణయం

ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాటో కూటమిలో చేరడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు. నాటోలో చేరాలనుకోవడం లేదని చెప్పారు. మాపై దాడి చేస్తున్న రష్యాపై నాటో దేశాలు పోరాటం చేయడం లేదన్నారు. స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపైనా రాజీ పడినట్లు తెలిపారు. రష్యా కూడా ఉక్రెయిన్ నుంచి ఇదే ఆశిస్తోంది. నాటోలో చేరొద్దని ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. తాజా ప్రకటన నేపథ్యంలో …

Read More »

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం – పుతిన్ ప్రేయసి ఎక్కడ ఉందో తెలుసా…?

ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత పన్నెండు రోజులుగా రష్యా బాంబుల యుద్ధాన్ని కొనసాగిస్తుంది. యావత్ ప్రపంచమంతా చోద్యం చూస్తున్నట్లు మీడియా ప్రకటనలకు పరిమితమై ఉన్నాయి తప్పా ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు ఏ ఒక్క దేశం. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన కుటుంబాన్ని క్షేమంగా అణుబంకర్లలో దాచాడు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న తన ప్రేయసీ …

Read More »

ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక  బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

Read More »

పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్లు -వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన

రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.

Read More »

రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్

రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.

Read More »

ఉక్రెయిన్ సైన్యానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కీలక సూచనలు

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఉక్రెయిన్ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ‘మీ ప్రభుత్వంపై తిరగబడండి. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి కూలదోయండి. ఉక్రెయిన్ నాయకత్వం ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా. ఉక్రెయిన్ నాయకులు అభినవ నాజీలు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయవద్దు’ అని పుతిన్ పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat